గుడ్డు – పోషకాల నిధి
గుడ్డు ప్రోటీన్, విటమిన్ A, B12, D, కోలిన్, యాంటీ ఆక్సిడెంట్లతో ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంలో, కండరాల బలానికి సహాయపడుతుంది.
ఉడికించిన గుడ్డు – ఆరోగ్యానికి ఉత్తమం
- తక్కువ కేలరీలు, కొవ్వులు
- అన్ని పోషకాలు అలాగే ఉంటాయి
- అదనపు నూనె లేకుండా తినే అవకాశం ఉంటుంది.
ఉడికించిన గుడ్డు బరువు తగ్గాలనుకునేవారికి, ఫిట్నెస్ ఫాలో అవుతున్న వారికి అత్యుత్తమ ఎంపిక.
ఆమ్లెట్ – రుచికరమే కానీ…
ఆమ్లెట్ రుచికరంగా ఉంటేను, నూనె, వెన్న, మసాలాలు, కూరగాయలు కలిపితే కేలరీలు, కొవ్వులు పెరుగుతాయి. తరచుగా తీసుకుంటే బరువు పెరగడానికి కారణం కావచ్చు.
