క్రాన్బెర్రీస్ పండు లాభాలుఆరోగ్యానికి మేలు చేసే క్రాన్బెర్రీస్ పండు

క్రాన్బెర్రీస్ (Cranberries) అనేవి చిన్న, చక్కగా ఎర్రగా ఉండే పండ్లు. ఇవి ప్రధానంగా అమెరికా, కెనడా వంటి చల్లని ప్రాంతాల్లో పెరుగుతాయి. మనదేశంలో ఇవి ఎక్కువగా డ్రై పండ్ల రూపంలో లభ్యమవుతాయి. ఇటీవల కాలంలో ఆరోగ్యప్రదమైన ఫలహారంగా క్రాన్బెర్రీస్‌కి మంచి డిమాండ్ పెరిగింది. వీటిలో పోషక విలువలు అధికంగా ఉండటంతో, ఆరోగ్యంపై విస్తృత ప్రభావం చూపుతాయి.

1. క్రాన్బెర్రీస్‌లో ఉండే ప్రొయాంటోసయానిడిన్స్ అనే పదార్థాలు బ్యాక్టీరియా మూత్రనాళాల్లో అతుక్కోకుండా అడ్డుకుంటాయి. దీంతో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల (UTIs)ను నివారించడంలో సహాయపడతాయి. తరచూ UTIలు వచ్చే వారికి క్రాన్బెర్రీస్ జ్యూస్ ఎంతో ప్రయోజనం ఇస్తుంది.

2. హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది:

ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రక్తనాళాలను శుభ్రపరుస్తాయి. LDL (బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించి, గుండెకు మంచి రక్తప్రసరణను అందించడంలో సహాయపడతాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇది సహజ చిట్కా.

 3. జీర్ణవ్యవస్థకు మేలు చేస్తుంది:

ఫైబర్ అధికంగా ఉండే క్రాన్బెర్రీస్ మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలకు నివారణగా పనిచేస్తాయి. ఇది పచ్చిపండ్ల రూపంలో కాకపోయినా, డ్రై రూపంలో తీసుకున్నా సరే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

 4. దంత సమస్యల నివారణ:

క్రాన్బెర్రీస్ లోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంతాల్లో బ్యాక్టీరియా పెరగకుండా అడ్డుకుంటాయి. దంత పుట్టలు, జింజివిటిస్ వంటి సమస్యలకు మంచి నివారణగా భావిస్తారు.

 5. మెదడు ఆరోగ్యానికి బూస్ట్:

వయసుతో పాటు మెదడు పనితీరు తగ్గుతుంటుంది. క్రాన్బెర్రీలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడులో న్యూరాన్ కణాల పనితీరును మెరుగుపరుస్తాయి. ఇది డిమెన్షియా, అల్జీమర్స్ వంటి వ్యాధుల రిస్క్‌ను తగ్గించవచ్చు.

 6. బరువు తగ్గే వారికి సహాయపడుతుంది:

క్రాన్బెర్రీలు తక్కువ కేలరీలతో, అధిక ఫైబర్‌తో ఉండటం వల్ల వేగంగా తృప్తి కలిగిస్తాయి. ఫలితంగా అధిక ఆహారాన్ని తీసుకోవడం తగ్గి బరువు తగ్గడంలో సహాయపడతాయి.

 జాగ్రత్తలు:

  • చక్కెర కలిపిన క్రాన్బెర్రీ జ్యూస్ లేదా డ్రై క్రాన్బెర్రీలు ఎక్కువగా తినకండి.

  • షుగర్ ఉన్నవారు, కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు మితంగా తీసుకోవాలి.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *