రాత్రి 8 తర్వాత తినడం ఆరోగ్యానికి హానికరమా?
నేటి బిజీ జీవనశైలిలో చాలా మంది రాత్రి 8 తర్వాత భోజన సమయం మారుతోంది. ముఖ్యంగా రాత్రులే ఫ్రీ టైమ్‌గా ఉండటంతో అప్పుడే తినే అలవాటు పెరిగిపోతుంది. అయితే నిపుణుల ప్రకారం ఇది ఆరోగ్యానికి చాలా హానికరమని చెబుతున్నారు.
హార్మోన్ల అసమతుల్యత
నేచురల్ మెడిసిన్ డాక్టర్ జోష్ యాక్స్ ప్రకారం, రాత్రుళ్లు ఆలస్యంగా తినడం వల్ల శరీరంలోని హార్మోన్ల సంతులనం దెబ్బతింటుంది. ఇది మెలటోనిన్ తయారులో ఆటంకం కలిగిస్తుంది. మెలటోనిన్ సరైన సమయంలో విడుదల కాకపోవడం వల్ల నిద్ర సరిగా పట్టదు.
బ్లడ్ షుగర్ పెరుగుదల
8 గంటల తర్వాత తినడం వల్ల బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెరుగుతాయి. దీనివల్ల ఇన్సులిన్ విడుదల ఎక్కువగా జరిగి శరీరం ఫ్యాట్ బర్న్ చేయకుండా నిల్వ చేస్తుంది. ఇది obesity (అధిక బరువు) కు దారితీస్తుంది.
నిద్రలేమి మరియు ఒత్తిడి
లేట్ డిన్నర్ వల్ల నిద్రకు అంతరాయం కలుగుతుంది. ఇది నెమ్మదిగా ఒత్తిడికి, మూడ్ స్వింగ్స్‌కి కారణమవుతుంది. నిద్రలో తేడా రావడం హార్మోన్లపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది.
ముందుగానే తినడం వల్ల లాభాలే
రాత్రి 8కి ముందు తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. బరువు పెరగదు, మలవిసర్జన సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా నిద్ర క్వాలిటీ మెరుగవుతుంది. శరీరం దాన్ని తానే రిపేర్ చేసుకునే పనిలోకి వెళ్లగలదు.
నిపుణుల సూచనలు
-
రోజూ ఒకే టైమ్‌కి భోజనం చేయాలి
-
రాత్రిపూట లైట్ డిన్నర్ తీసుకోవాలి
-
డిన్నర్ తర్వాత కనీసం 1 గంట వాకింగ్ చేయడం మంచిది

