“ఎగ్స్ తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది” అనే భయంతో చాలామంది ప్రజలు ఈ అద్భుతమైన ఆహారాన్ని రోజూ తీసుకోకుండా మానేస్తున్నారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూట్రిషనిస్ట్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆ ఆందోళనలకు ముగింపు పలికాయి. ఆమె చెబుతున్నట్లు, రోజుకు ఒకటి రెండు ఎగ్స్ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని స్పష్టం చేశారు.
మొదటిగా తెలియాల్సింది ఏమిటంటే – ఎగ్స్‌లో ఉన్న కొలెస్ట్రాల్, రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)కి నేరుగా సంబంధం లేదు. అంటే, ఎగ్స్ తిన్న వెంటనే మీ బాడీలో కోలెస్ట్రాల్ ప్రమాదకరంగా పెరగదు. సహజంగా శరీరం 70% వరకు కోలెస్ట్రాల్‌ను స్వయంగా ఉత్పత్తి చేస్తుంది. మిగతా 30% మాత్రమే ఆహారం ద్వారా వస్తుంది. అంతే కాకుండా, ఎగ్స్‌లో ఉండే హై డెన్సిటీ లైపోప్రోటీన్ (HDL) ఆరోగ్యానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్.
ఎగ్స్‌లో ఉండే ప్రధాన పోషకాల వివరాలు:
-
ప్రోటీన్
-
విటమిన్ B12
-
విటమిన్ D
-
సెలెనియం
-
కొలిన్ (మెదడు ఆరోగ్యానికి కీలకం)
న్యూట్రిషనిస్ట్ చెప్పినట్లు, రోజుకు 1-2 పూర్తి ఎగ్స్ (యోక్‌తో సహా) తినడంలో ఏ హాని లేదు. ముఖ్యంగా వ్యాయామం చేసే వ్యక్తులకు, పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు, బరువు తగ్గాలనుకునే వారికి ఎగ్స్ మంచి ఆహారం.
అయితే, Already హై కొలెస్ట్రాల్ లేదా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవారు, డాక్టర్ సలహాతో మాత్రమే ఎగ్స్ తీసుకోవాలి. అదే సమయంలో, మీరు ఎగ్స్‌ను ఎలా వండుతున్నారన్నదీ ముఖ్యం. బటర్, అధిక ఆయిల్ వాడుతూ ఆమ్లెట్ లేదా డీప్ ఫ్రై చేస్తే ఆరోగ్య ప్రయోజనం తగ్గిపోతుంది.
బెస్టు తినే విధానం:
-
బాయిల్డ్ ఎగ్స్ – తక్కువ కాలరీలు, అధిక పోషకాలు
-
పోచ్డ్ ఎగ్స్ – తక్కువ ఆయిల్‌తో వండవచ్చు
-
సాలడ్ లేదా బ్రెడ్‌తో కలిపి తీసుకోవచ్చు