59 ఏళ్ల వయసులోనూ షారుఖ్ ఖాన్ యంగ్‌గా, ఫిట్‌గా కనిపించడం వెనక అసలైన కారణం ఏంటో మీకు తెలుసా?
అతని డెడ్డికేషన్ మాత్రమే కాదు, ఆయన డైట్ అలవాట్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. మనమూ షారుఖ్ లా ఆరోగ్యంగా ఉండాలంటే, అతను పాటిస్తున్న కొన్ని సింపుల్ నియమాలను అనుసరించాల్సిందే.
షారుఖ్ డైట్ విషయంలో చాలా స్ట్రిక్ట్. ఆయన పొరపాటున కూడా వైట్ రైస్, వైట్ బ్రెడ్, షుగర్ లేదా ఆల్కహాల్ తీసుకోడు. ముఖ్యంగా అతను లీన్ మీట్స్, ఎగ్ వైట్స్, మొలకలు, గ్రిల్డ్ చికెన్, బ్రకోలి వంటి ప్రొటీన్ రిచ్ ఆహారాలను మాత్రమే తీసుకుంటాడు. వీటితో పాటు పప్పులు కూడా ఆహారంలో ఉంటాయి, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి.
రోజుకు రెండు పూటలే భోజనం షారుఖ్ తీసుకుంటాడు. మిగిలిన సమయంలో స్నాక్స్, జంక్ ఫుడ్ వంటి వాటికి పూర్తిగా “నో” చెబుతాడు. షూటింగ్లో ఉన్నా కూడా హోటల్ ఫుడ్ తినకుండా ఇంటి నుంచే హోమ్ ఫుడ్ తెప్పించుకుని తినడం అతని అలవాటు.
షారుఖ్ ఖాన్ ఆరోగ్య రహస్యం కేవలం ఫుడ్ మాత్రమే కాదు – నిద్ర మరియు వ్యాయామం కూడా ముఖ్యమైన భాగాలు. పడుకునే ముందు వర్కౌట్స్ చేయడం, కనీసం 6 గంటల నిద్ర తీసుకోవడం అతను తప్పనిసరిగా పాటిస్తాడు. ఉదయం 10 గంటలకు నిద్రలేచి, ఆ తరువాతే అన్ని పనులు ప్రారంభిస్తాడు.
అతను ఇష్టంగా తినే ఫుడ్‌లో తందూరి చికెన్ ప్రత్యేకమైనది. డిన్నర్లో కూడా తందూరి రోటీతో తందూరి చికెన్ తినడం అతని రొటీన్. మటన్, ఫిష్ కూడా కొన్నిసార్లు తీసుకుంటాడు. ఐస్ క్రీమ్ ప్రేమికుడైనా, ఇతర స్వీట్స్‌కు దూరంగా ఉంటాడు.
మొత్తంగా, షారుఖ్ ఖాన్ డైట్ పద్ధతులు ఎవరైనా అనుసరిస్తే, వయస్సుతో సంబంధం లేకుండా ఫిట్‌గా, యాక్టివ్‌గా ఉండొచ్చు. డైట్ కష్టతరంగా అనిపించినా, దీన్ని హల్కా మార్గంలో అనుసరించడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యం పొందవచ్చు.

