బెల్లీ ఫ్యాట్ అనేది మన శరీరంలో సులభంగా పేరుకునే కొవ్వు. ఇది కేవలం అందానికి విఘాతం కలిగించడమే కాదు, అనేక హెల్త్ సమస్యలకూ మూలం అవుతుంది. అధిక కొలెస్ట్రాల్, డయాబెటిస్, గుండె సంబంధిత రోగాలకు ఇది ప్రధాన కారకం. అందుకే శాస్త్రీయమైన డైట్, ఎక్సర్‌సైజ్‌లతో పాటు కొన్ని సహజమైన న్యూట్రిషనల్ డ్రింక్స్‌ను వాడడం వల్ల మంచి ఫలితాలు కనబడతాయి.
ఇందులోనే న్యూట్రిషనిస్ట్ రమితా కౌర్ సూచించిన ఓ “మ్యాజికల్ డ్రింక్” ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ డ్రింక్ రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపున తాగితే బాడీలోని బెల్లీ ఫ్యాట్ బర్న్ అవుతుంది. మరి ఈ డ్రింక్ ఎలా తయారుచేయాలో చూద్దాం:
కావాల్సిన పదార్థాలు:
-
నీరు – 1 గ్లాసు
-
అల్లం తురుము – 1 అంగుళం
-
పసుపు – పావు టీస్పూన్
-
జాజికాయ పొడి – చిటికెడు
-
నల్ల మిరియాల పొడి – చిటికెడు
-
లవంగం – 1
-
చెక్క – సగం
-
నిమ్మరసం – అవసరమైనంత
తయారీ విధానం:
-
ముందుగా నీటిని బాగా మరిగించాలి. అందులో అల్లం తురుము, లవంగం, చెక్క వేసి మరిగించాలి.
-
మరో గ్లాసులో పసుపు, మిరియాల పొడి, జాజికాయ పొడి వేసుకోవాలి.
-
మరిగిన నీటిని వడగట్టి ఆ పొడుల మిశ్రమంలో కలపాలి.
-
చివరగా నిమ్మరసం కలిపి ఉదయాన్నే ఖాళీ కడుపున తాగాలి.
ఉపయోగాలు:
ఈ డ్రింక్‌లోని పదార్థాలు జీర్ణవ్యవస్థను శుభ్రపరచడం, కొలెస్ట్రాల్ తగ్గించడం, ఫ్యాట్‌ను గరిష్టంగా వేడి చేయడం వంటి లాభాలు కలిగిస్తాయి. ముఖ్యంగా పసుపు యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా పనిచేస్తూ ఫ్యాట్ సెల్స్ పై ప్రభావం చూపుతుంది.
గమనిక: ఇది ఆరోగ్య చిట్కాగా మాత్రమే ఇవ్వబడింది. ఏవైనా ఆరోగ్య సమస్యలున్నట్లయితే వైద్యులను సంప్రదించాలి.