పప్పన్నంలో అప్పడాలు నంచుకుని తింటున్నారా? జాగ్రత్త..! అమాంతం బీపీ పెరిగే ప్రమాదం
బ్లడ్ ప్రెజర్ (బీపీ) అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్య. ఒక్కసారి వచ్చాక అది సరిగ్గా నియంత్రణలో లేకపోతే హార్ట్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి అనేక ప్రమాదాలు తలెత్తే అవకాశముంది. ముఖ్యంగా ఆహారంలో చేసిన చిన్న పొరపాట్లే బీపీని వేగంగా పెంచే కారణమవుతాయి.
ఈ నేపధ్యంలో న్యూట్రిషనిస్ట్ కిరణ్ కుక్రేజా హైబీపీ ఉన్నవారు తప్పకుండా దూరంగా ఉండాల్సిన కొన్ని సాధారణ ఆహారాలను సూచించారు. అవి మనం రోజూ తినే పదార్థాల్లోనే ఉంటాయి కాబట్టి అవగాహన అవసరం.
✅ తినకూడని ఆహారాలు:
1. పచ్చళ్లు:
తెలుగువారికి ప్రాణం లాంటి పచ్చళ్లు రుచికి బాగుండినా, వాటిలో ఉప్పు, సోడియం అధికంగా ఉంటుంది. ఇది బీపీకి అత్యంత హానికరం. రెగ్యులర్‌గా తీసుకుంటే బీపీ అదుపు తప్పే అవకాశం ఉంటుంది.
2. ప్యాకేజ్డ్ సాస్‌లు:
కెచప్, టోమాటో సాస్ లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం పెరిగి బీపీ పెరుగుతుంది. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్‌లో ఇవి ఎక్కువగా వాడుతారు.
3. అప్పడాలు:
పప్పన్నం తోపాటు అప్పడాలు తినడం చాలా మందికి అలవాటు. కానీ ఇవి ఎక్కువ ఉప్పుతో తయారవుతాయి. బీపీ ఉన్నవారు వీటిని తప్పక దూరంగా ఉంచాలి.
4. బేకింగ్ సోడా:
వేపుళ్లు, బజ్జీలు వంటి స్నాక్స్‌లో బేకింగ్ సోడా వాడతారు. ఇది శరీరంలోని నీరు నిల్వ ఉంచి బీపీని పెంచుతుంది. అలాగే కిడ్నీ సమస్యలున్నవారికి ప్రమాదకరం.
5. ప్రాసెస్డ్ చీజ్:
ఈ చీజ్ టేస్టీగానే ఉంటుంది గానీ, సోడియం, సాచురేటెడ్ ఫ్యాట్ అధికంగా ఉంటుంది. బీపీని వేగంగా పెంచే శక్తి కలిగిన ఈ పదార్థాన్ని పూర్తిగా నివారించాలి.