రాత్రి భోజనాన్ని అనేక మంది తక్కువగా పట్టించుకోరు. అయితే రాత్రి 8 గంటల తర్వాత తినే ఆహారాలపై జాగ్రత్త వహించకపోతే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు తలెత్తే అవకాశముంది. అలాగే రాత్రివేళ ఎక్కువగా తినడం వల్ల బరువు పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఈ సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని నిపుణులు సూచించే ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను తెలుసుకుందాం.
1. బాయిల్డ్ ఎగ్స్ – గుడ్లలో తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రొటీన్ ఉండడం వల్ల ఇవి రాత్రి వేళకి మంచి ఎంపిక. ఆకలి తగ్గించి, ఫుల్ మీల్స్ తినకుండా అడ్డుకుంటాయి.
2. అరటి పండు + పీనట్ బట్టర్ – అరటిలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కండరాల నొప్పులు తగ్గిస్తాయి. పీనట్ బట్టర్తో కలిపి తింటే శరీరానికి శక్తినిస్తాయి, నిద్ర బాగా పడుతుంది.
3. నట్స్ – బాదం, వాల్ నట్స్ లాంటి డ్రై ఫ్రూట్స్ మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒత్తిడిని తగ్గించి నిద్ర పట్టేలా సహాయపడతాయి. గుప్పెడు నట్స్ తినడం ఆరోగ్యానికి మంచిది.
4. గ్రీక్ యోగర్ట్ – క్యాసైన్ ప్రొటీన్ సమృద్ధిగా ఉండే గ్రీక్ యోగర్ట్ నెమ్మదిగా జీర్ణమవుతుంది. దీని వల్ల రాత్రి పూట ఆకలి అనిపించదు. బెర్రీలు కలిపి తింటే మరింత లాభం.
5. షెడ్యూల్ ప్రకారం డిన్నర్ – డిన్నర్ 6–7 గంటల లోపు చేయడం ఉత్తమం. నిద్రకు ముందు రెండు గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. అలా చేస్తే జీర్ణక్రియ సజావుగా సాగుతుంది.
6. తిన్న తర్వాత నడక – డిన్నర్ తరువాత కనీసం 15 నిమిషాలైనా వాకింగ్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి, శరీరం చురుగ్గా మారుతుంది.
ఈ ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తే, మలబద్ధకం, అధిక బరువు వంటి సమస్యలు దూరమవుతాయి. శరీరానికి తక్కువ ఆహారంతో ఎక్కువ పోషకాలు అందేలా చూస్తే నైట్స్ కూడా హెల్తీగా ఉంటాయి. కానీ ఈ మార్పులు చేయేముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.