రామపురం జలాశయంలో ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ దృశ్యం
Spread the love

రామపురం జలాశయంలో ఫ్లోటింగ్ సోలార్ యూనిట్‌తో ప్రకృతి సౌరభం.

చుట్టూ ఎత్తయిన కొండలు, మేడిన పచ్చని చెట్ల మధ్య విశాలంగా విస్తరించిన రామపురం జలాశయం, ప్రకృతి ప్రేమికులకు ఒక అందమైన ఆకర్షణగా మారింది. శ్రీకాళహస్తి మండలంలోని ఈ ప్రదేశాన్ని ఇటీవల డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించగా, మధ్యలో కనిపించే ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతి స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా ఈ ఫ్లోటింగ్ సౌర యూనిట్‌ను నాలుగు మెగావాట్ల సామర్థ్యంతో నిర్మించారు. ఈ విధానం పర్యావరణ అనుకూలంగా ఉండటమే కాకుండా, నీటి ఉపరితలాన్ని ఉపయోగించుకోవడం వల్ల భూమి ఉపరితల వినియోగం కూడా తగ్గుతుంది. ఇది సౌర విద్యుత్ ఉత్పత్తికి ఒక ఆధునిక మార్గంగా నిలుస్తోంది.

 రామపురం జలాశయం – ప్రకృతి రమణీయం

 ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ ఆకర్షణ

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *