చిత్తూరు జిల్లాలో అండర్-14, అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక – రేపు మూడు కేంద్రాల్లో నిర్వహణ
ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (CDCA) ఆధ్వర్యంలో బాలల క్రికెట్ అభివృద్ధి కోసం అండర్-14, అండర్-16 క్రికెట్ జట్ల ఎంపిక కార్యక్రమం జూన్ 15న ఆదివారం జరుగనుంది. CDCA అధ్యక్షుడు విజయ్ కుమార్, కార్యదర్శి రవి కుమార్ లు ఈ విషయాన్ని శుక్రవారం వెల్లడించారు.
ఎంపిక ప్రక్రియ జిల్లాలోని మూడు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మదనపల్లె డివిజన్‌కు చెందిన వాళ్ళికపూరం G.V.S.S.S క్రీడా మైదానం, తిరుపతిలోని మంగళం రోడ్డులో ఉన్న CDCA క్రీడామైదానం, మరియు చిత్తూరులోని పోలీస్ గ్రౌండ్లలో ఈ ఎంపికలు జరుగుతాయి.
ఉదయం 9 గంటలకు అండర్-14 విభాగం, మధ్యాహ్నం 2 గంటలకు అండర్-16 విభాగ ఎంపికలు ప్రారంభమవుతాయి. అండర్-14కు 1 సెప్టెంబర్ 2011 తర్వాత జన్మించిన పిల్లలు, అండర్-16కు 1 సెప్టెంబర్ 2009 నుండి 31 ఆగస్టు 2011 మధ్య జన్మించిన పిల్లలు అర్హులు.
ఈ ఎంపికల ద్వారా ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లను గుర్తించి జిల్లా తరఫున ప్రాతినిధ్యం ఇచ్చేందుకు అవకాశమిస్తామని CDCA ప్రతినిధులు తెలిపారు.
