శ్రీకాళహస్తిలో ప్లాస్టిక్ నిషేధ ప్రచారం
Spread the love

శ్రీకాళహస్తిలో మళ్లీ ప్లాస్టిక్‌పై సమర శంఖం

 పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలపై మళ్లీ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు మున్సిపల్ అధికారులు. 2018 అక్టోబర్ 2న తెదేపా ప్రభుత్వ కాలంలో ప్రారంభించిన ప్లాస్టిక్ నిషేధం వాస్తవంగా ఎక్కడా పూర్తిగా అమలుకావడం లేదని అధికారులు గుర్తించారు. దీనివల్ల మురుగు కాలువలు, రోడ్ల పక్కన, డంపింగ్ యార్డుల్లో ప్లాస్టిక్ కవర్లు, టీ కప్పులు, థర్మోకోల్ గుట్టలుగా పేరుకుపోతున్నాయి.

ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం అక్టోబర్ 2, 2025 నాటికి ప్లాస్టిక్ నిషేధాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని నిర్ణయించింది. దీనిలో భాగంగా జూన్ 18వ తేదీ నుంచి మళ్లీ మున్సిపాలిటీలకు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇకపై ఒక్కసారి వాడి పడేసే ప్లాస్టిక్ వస్తువుల విక్రయంపై నిషేధం అమలవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *