వేడి చేయొద్దని సూచించిన ఆహార పదార్థాలు
Spread the love

మళ్లీ మళ్లీ వేడి చేయడం ప్రమాదమే!

ఇంట్లో ఆహారం మిగిలిపోతే మనం ఫ్రిజ్‌లో పెట్టి తిరిగి వేడి చేస్తూ ఉంటాం. ఇది సాధారణమే అనిపించినా, కొన్ని ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేయడం వల్ల ఆరోగ్యానికి తీవ్ర హానికరమవుతుందని హెచ్చరిస్తున్నారు ఆంకాలజిస్ట్ డాక్టర్ మోహన వంశీ.


 1. బంగాళాదుంప (Potatoes)

  • బంగాళాదుంపలో నైట్రేట్స్ అధికంగా ఉంటాయి.

  • మళ్లీ మళ్లీ వేడి చేస్తే పొట్టలో వికారం, వాంతులు, విరేచనాలు వచ్చే అవకాశం.

  • క్లాస్ట్రిడియమ్ బాట్యులినమ్ అనే ప్రమాదకర బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.

  • ఫుడ్ పాయిజనింగ్‌కు దారి తీస్తుంది.


 2. పాలకూర (Spinach)

  • పాలకూరలో ఐరన్, విటమిన్లు, నైట్రేట్స్ అధికంగా ఉంటాయి.

  • వేడి చేసినప్పుడు నైట్రేట్‌లు, అమినో యాసిడ్స్ కలిసి క్యాన్సర్ రిస్క్ పెంచుతాయి.

  • తాజాగా తినడమే ఉత్తమం.


 3. మష్రూమ్స్ (Mushrooms)

  • మష్రూమ్‌లను మళ్లీ వేడి చేస్తే రుచి, రంగు మారిపోతుంది.

  • బ్యాక్టీరియా అభివృద్ధి చెందే ప్రమాదం.

  • వాంతులు, విరేచనాలు, గుండె సమస్యలు వచ్చే అవకాశం.


 4. గుడ్లు (Eggs)

  • మళ్లీ వేడి చేసిన గుడ్లు తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్, అసిడిటీ, కడుపు ఉబ్బరం వచ్చే అవకాశం.

  • ఫ్రిజ్‌లో పెట్టిన గుడ్ల కూరను వేడి చేయకుండా వదిలేయడం మంచిది.


 5. టీ (Tea)

  • పదేపదే వేడి చేసిన టీ రుచి, పోషకాలు కోల్పోతుంది.

  • ఇందులో హానికరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది.

  • తాజాగా టీ తయారు చేసి తాగడమే మంచిది.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *