జొన్నలతో శక్తివంతమైన ఆరోగ్యం – ప్రతి రోజు మీ ప్లేట్లో జొన్నలు ఉండాలిజొన్నలతో శక్తివంతమైన ఆరోగ్యం – ప్రతి రోజు మీ ప్లేట్లో జొన్నలు ఉండాలి
Spread the love

జొన్నలు అనేవి మన సంప్రదాయ ఆహారంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్న ధాన్యాలు. గత కొంతకాలంగా మళ్లీ ఆరోగ్యపరంగా వీటి ప్రాధాన్యం పెరిగింది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు, డయాబెటిస్ ఉన్నవారు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు జొన్నలను తరచూ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.

జొన్నల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. పేగుల పనితీరు మెరుగవడంతో పాటు, మలబద్దకం సమస్య కూడా తగ్గుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల చాలా సేపు నిండిన ఫీలింగ్ కలిగి ఉండటం వలన ఆకలికీ బ్రేక్ పడుతుంది. దీని వల్ల అధికంగా తినకుండా నియంత్రించుకోవచ్చు. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.

జొన్నలు లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీని వలన రక్తంలోని చక్కెర స్థాయులు వేగంగా పెరగకుండా నియంత్రణలో ఉంటాయి. ఈ లక్షణం డయాబెటిస్ ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే జొన్నల్లో మాగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ బీ కాంప్లెక్స్ లాంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన శక్తిని అందించడంతో పాటు, ఎముకల దృఢత్వాన్ని మెరుగుపరుస్తాయి.

జొన్నల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీని వలన గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే జొన్నల్లో గ్లూటెన్ ఉండదు. అందువల్ల గ్లూటెన్ అలర్జీ ఉన్నవారు కూడా ఇవి నిశ్చింతగా తీసుకోవచ్చు.

ఈ విధంగా చూస్తే, జొన్నలు కేవలం ఒక సాధారణ ఆహారం కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే ధాన్యంగా నిలుస్తున్నాయి. రోజూ ఆహారంలో జొన్నలను చేర్చడం వల్ల, మీ ఆరోగ్య ప్రయాణంలో ఓ పెద్ద అడుగు వేయగలుగుతారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *