పాకాల మామిడి రైతులు మార్కెట్ వద్ద ధరలపై చర్చ
Spread the love

ఊరట దక్కేనా… ఒత్తుత్తి మాటలేనా? – పాకాల మామిడి రైతుల ఆవేదన

పాకాల, జూన్ 5, 2025: గతేడాది చక్కటి ఆదాయం ఇచ్చిన మామిడి ఈ సంవత్సరం పాకాల రైతులకు చేదు అనుభవాలు మిగిల్చింది. మార్కెట్‌లో ధరలు తీవ్రంగా పడిపోయి, రైతులు తమ కృషికి తగిన ధర లభించక నష్టపోతున్నారు. దళారులు ధరల్ని నియంత్రిస్తూ రైతులను లాభాలకంటే నష్టాల్లోకి నెట్టేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాము మార్కెట్‌కు తీసుకెళ్లిన మామిడికాయలు తక్కువ ధరకు అమ్మకానికి వెళ్లిపోతుండడంతో, రైతులకు ఖర్చులు కూడా మిగలడం లేదని చెప్పుకుంటున్నారు. స్థానిక వ్యవసాయ అధికారులు, మార్కెట్ కమిటీ సభ్యుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, ఇప్పటివరకు ఫలితం కనపడలేదని ఆగ్రహిస్తున్నారు.

రైతుల పట్ల ప్రభుత్వం సానుభూతితో వ్యవహరించి, మద్దతు ధరలను ప్రకటించి, తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పంట తీయడమే కాక, మార్కెటింగ్ చేయడం, తగిన ధర లభించడమే ఇప్పుడు ప్రధాన సవాలుగా మారింది.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *