PMSF Protest at Tirupati Collectorate for PG Reimbursement
Spread the love

 పీజీ రీయింబర్స్‌మెంట్ విడుదల కోసం పీఎంఎస్‌ఎఫ్ విద్యార్థుల ధర్నా

తిరుపతి, న్యూస్‌టుడే: పీజీ విద్యార్థుల విద్యా భవిష్యత్తు ప్రమాదంలో పడకూడదన్న ఉద్దేశంతో పీజీ రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని పీపుల్స్‌ మెానిటరింగ్‌ స్టూడెంట్‌ ఫెడరేషన్ (PMSF) డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర సహాయ కార్యదర్శి బండి చలపతి శుక్రవారం తిరుపతి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు నాయకత్వం వహించారు.

 విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం

ఈ సందర్భంగా బండి చలపతి మాట్లాడుతూ, “PG విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ జాప్యం వల్ల విద్య కొనసాగించలేని పరిస్థితి నెలకొంది. కొందరు పరీక్షలు రాయలేకపోతున్నారు, మరికొందరు కళాశాల ఫీజు కోసం అప్పులు చేస్తూ బాధపడుతున్నారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.

 ప్రభుత్వం తక్షణ స్పందన అవసరం

బంధ్, ధర్నాలు చేయకముందే ప్రభుత్వం స్పందించి ర్యింబర్స్‌మెంట్‌కు సంబంధించిన నిధులు విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలోని వేలాది పీజీ విద్యార్థుల భవిష్యత్తు ఈ నిధులపై ఆధారపడినందున, మరింత ఆలస్యం చెందితే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని PMSF హెచ్చరించింది.

 కలెక్టర్‌కు వినతిపత్రం అందజేత

ఆందోళన అనంతరం తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్లుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వానికి విద్యార్థుల ఆవేదనను తెలియజేయాలని కోరారు. విద్యార్హత ఉన్న ప్రతి విద్యార్థికి ఫీజు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.

 విద్యార్థుల సంఘీభావం

ఈ ధర్నాలో పలు విద్యాసంస్థల విద్యార్థులు పాల్గొని పీజీ రీయింబర్స్‌మెంట్ విడుదలకు నినాదాలు చేశారు. వారు మాట్లాడుతూ – “విద్యా హక్కును హరించే విధంగా ప్రవర్తించకండి, విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి” అని తెలిపారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *