రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలుకా’ టైటిల్ గ్లింప్స్ అదుర్స్!
రామ్ మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి!
రామ్ పోతినేని ఓ మాస్ హిట్ కొట్టి చాలా ఏళ్లు అవుతోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ రేంజ్‌లో సక్సెస్‌ను అందుకోవడం అతనికి కష్టంగా మారింది. స్కంధ సినిమా ట్రోలింగ్ మెటీరియల్‌గా మారినా, బీ, సీ సెంటర్లలో కొన్ని కలెక్షన్లు రాబట్టినట్టు సమాచారం. ఇప్పుడు మాత్రం అతను తన సొంత స్టైల్‌తో, అభిమానులను ఆకట్టుకునేలా “ఆంధ్రా కింగ్ తాలుకా” అనే టైటిల్ గల సినిమాతో వస్తున్నాడు.
టైటిల్ గ్లింప్స్‌తో పూనకం
రామ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ అభిమానుల్లో పూనకం నింపేశాయి. థియేటర్ టికెట్ల కోసం గొడవపడే సీన్‌తో మొదలై, “ఆంధ్రా కింగ్ తాలుకా” అనే డైలాగ్‌తో ముగిసే ఈ గ్లింప్స్ సినిమాకు ఫ్యాన్ బయోపిక్ టచ్ ఉందని స్పష్టం చేస్తోంది.
రామ్ – భాగ్య శ్రీ రీఫ్రెషింగ్ కాంబో
ఈ సినిమాలో రామ్‌తో పాటు హీరోయిన్‌గా భాగ్య శ్రీ కనిపించనుంది. గతంలో మిస్టర్ బచ్చన్ సినిమాతో ప్రయత్నించిన ఆమెకు ఈ చిత్రం టర్నింగ్ పాయింట్ కావొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఉపేంద్ర స్పెషల్ పాత్ర
ఈ గ్లింప్స్‌లో తెలుగు హీరోల పేర్లు టచ్ చేయకుండా, ఉపేంద్రను రిఫరెన్స్‌గా తీసుకోవడం ఓ సేఫ్ గేమ్ అనిపిస్తోంది. అభిమానుల మధ్య గొడవలు తలెత్తకుండా మేకర్స్ చాకచక్యంగా వ్యవహరించారు. ఉపేంద్ర పాత్ర కథలో ఎంతవరకు ఉంటుంది? క్లైమాక్స్ వరకు కొనసాగుతుందా? అన్నదీ ఆసక్తికరమైన విషయం.