ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు 50,541 దరఖాస్తులు – ఒక్కో సీటుకు 12 మంది పోటీ
2025-26 విద్యా సంవత్సరానికి ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాల కోసం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (RGUKT) విడుదల చేసిన నోటిఫికేషన్‌కు విశేష స్పందన లభించింది. ఇడుపులపాయ, నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో కలిపి ఉన్న మొత్తం 4,400 సీట్లకు 50,541 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు.
ఈ దఫా ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల నుంచే ఎక్కువ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం దరఖాస్తుదారుల్లో బాలికల సంఖ్య 28,309 కాగా, బాలురు 22,232 మంది ఉన్నారు. ఒక్కో సీటుకు సగటున 12 మంది పోటీ పడుతున్నారు, ఇది ఈ కోర్సుపై ఉన్న విశ్వాసాన్ని చూపిస్తోంది.
దరఖాస్తులలో అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలోనుంచి వచ్చిన వేళ, పార్వతీపురం మన్యం జిల్లా తక్కువ దరఖాస్తులతో నిలిచింది. చిత్తూరు జిల్లాలోంచి 2,071 దరఖాస్తులు, తిరుపతి జిల్లాలోంచి 1,899 దరఖాస్తులు అందాయి.
