తితిదే పాఠశాల ప్రారంభోత్సవంలో విద్యార్థులకు స్వాగతం
Spread the love

తితిదే విద్యాసంస్థల్లో చదవడం అదృష్టం – విద్యార్థుల భవిష్యత్తు కోసం సమర్పణతో ఉపాధ్యాయుల కృషి అవసరం

తితిదే విద్యాసంస్థల్లో విద్య అభ్యసించడం ఒక గొప్ప అవకాశమని తిరుపతి విద్యాశాఖాధికారి వెంకట సునీలు తెలిపారు. గురువారం తిరుపతిలోని ఎస్వీఎస్ మరియు ఓరియంటల్ ఉన్నత పాఠశాలల్లో పాఠశాల పునఃప్రారంభ కార్యక్రమం సందర్భంగా ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఆయన, విద్యార్థులను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. తితిదే విద్యాసంస్థలు విద్య, అనుభవం, ఆచరణా నైపుణ్యాలను సమగ్రంగా అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతున్నాయని తెలిపారు. ఉపాధ్యాయులు ప్రేమ, నిబద్ధతతో విద్యార్థులను గైడ్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్బన్ మండల విద్యాశాఖ అధికారి భాస్కర్ నాయక్, హెచ్ఎం డి. చంద్రయ్య పాల్గొన్నారు. విద్యార్థులకు విద్యా సామగ్రిని అందజేశారు.

By Editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *