విజయ్ దేవరకొండ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చుకొని ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నారు. ఇన్ని రోజులుగా “కింగ్డమ్” మూవీ కోసం గడ్డంతో ఉన్న విజయ్, ఇప్పుడు క్లీన్షేవ్, కోర మీసంతో కనిపించడం విశేషం. ఈ లుక్ చూసిన అభిమానులు “రౌడీ జనార్ధన” కోసం ఆయన ప్రిపరేషన్ స్టార్ట్ చేశారని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ దశకు చేరుకోగా, విజయ్ లుక్ కూడా పాత్రకు తగ్గట్టే డిజైన్ చేసినట్టు తెలుస్తోంది. రవి కిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ పవర్‌ఫుల్ మాస్ పాత్రలో కనిపించబోతున్నారు. అందుకే కొత్తగా కోర మీసం, క్లీన్ షేవ్ లుక్‌కు షిఫ్ట్ అయ్యారు.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు. అక్కడ ఆయన కొత్త లుక్‌ను చూసిన జనాలు ఆశ్చర్యపోయారు. ఇంతవరకు గడ్డంతో కనిపించిన ఆయన ఒక్కసారిగా కొత్త అవతారం ఎత్తడంతో సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఫ్యాన్స్ మాత్రం ఇదే రౌడీ జనార్ధన ప్రిపరేషన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
విజయ్ కెరీర్ విషయంలో చూస్తే, గత కొద్ది కాలంగా విజయవంతమైన సినిమాలు లేకపోవడం అభిమానులను నిరాశపరుస్తోంది. “లైగర్” భారీ హైప్‌తో వచ్చినా పెద్ద ఫెయిల్యూర్ అయ్యింది. “ఖుషి”తో కొంత ఊరట లభించినా, పూర్తిగా అభిమానుల ఆశలను తీర్చలేదు. చివరగా వచ్చిన “ఫ్యామిలీ స్టార్” కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చింది. అయినా థియేటర్లలో విఫలమైనా, టీవీలో మాత్రం బాగానే ఆడింది.