తిరుమల శ్రీవారిని దర్శించిన జాన్వీ కపూర్
ప్రముఖ బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు చేరుకుని రాత్రి బస చేశారు. గురువారం ఉదయం నైవేద్య విరామం సమయంలో శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనం పొంది, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
ప్రధాన అంశాలు
-
అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు ప్రయాణం
-
రాత్రి తిరుమలలో బస
-
ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనం
-
వేదపండితుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాల స్వీకరణ
